కాంచన 3 ట్రైలర్ వచ్చేసింది

28 Mar,2019

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవా లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాంచన 3’. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. మనోబాల, దేవదర్శిని, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో... సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... ఇంతకు ముందు సినిమాలకంటే ౧౦౦టైమ్స్ చాలా బావుంటుంది ఈ చిత్రం. ఈ చిత్ర టీమ్ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
రాఘవ లారెన్స్ మాట్లాడుతూ... సినిమా గురించి నేను ఎక్కువ చెప్పకూడదు ట్రైలర్ చూశారు కాబట్టి సినిమా కూడా చూసి ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. ఠాగుర్ మధుగారు ఈ సినిమాకి చాలా కోపరేట్ చేశారు. నేను అనుకున్న దానికంటే ఎక్కవగానే ప్రమోషన్స్ ఇస్తున్నారు. గత సినిమాలలాగానే ఈ సినిమా కూడా కొంత మెసేజ్ ఉంటుంది. గత రెండు పార్ట్‌ల కన్నా హారర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మన తెలుగు సినిమాల్లో ౪ పార్ట్ ఏ సినిమమా రాలేదు ఇదే మొదటిది. ప్రేక్షకులు ఆదరిస్తే ౧౦ పార్ట్స్ వరకు తీయాలనుంది. గత సినిమాలన్నీ కమర్షియల్ మూవీస్. ఈ చిత్రంలో కోవేశరలమ్మ బదులు వేరే ఎవరినన్నా పెడదామనుకున్నా కాని ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. ఆమె కథకి తప్పకుండా అవసరం. తర్వాత రెండు సినిమాలు కమర్షియల్ మూవీస్ చేస్తున్నాను.

Recent News