అర్జున్ ,విజయ్ ఆంటోని, అషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తొన్న చిత్రం " కిల్లర్". హంతకుడు అనేది ట్యాగ్లెన్. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. బి.ప్రదీప్ సమర్పణలో ,దియా మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్ర స్నీక్ పీక్ టీజర్ ను,అర్జున్ బిగ్ సిడిని విడుదల చేశారు. సైమన్ కె.కింగ్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు గా ఇది నా తొలి తెలుగు చిత్రం. 3 పాటలుంటాయి. వేటికవే విభిన్నమైనవి. భాష్యశ్రీ మంచి లిరిక్స్ ను ఇచ్చారన్నారు. భాష్యశ్రీ మాట్లాడుతూ.. అన్నీ విబాగాల్లో ఇదొక అద్బుత చిత్రం. విజయ్ ఆంథోనీ, అర్జున్ గారి నటన కిల్లర్ సినిమాకు హైలెట్ . ఇదొ స్టైలీష్ క్రైమ్ థ్రిల్లర్. ప్రేక్షకుల కు తరువాత ఏం జరుగుతుందన్న ఇంట్రెస్ట్ ఉంటుందన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అర్జున్, విజయ్ ఆంథోని తెలుగులో హిట్స్ ఇచ్చిన నటులు. వారు గౌరవ ప్రదమైన నటులు. వీరి కాంబినేషన్ లో వస్తొన్న ఈ సినిమా సక్సెస్ కావాలని ఆసిస్తున్నానన్నారు.
అషిమా మాట్లాడుతూ.. దర్శకనిర్మాతల వల్ల ఈ సినిమా లొ అవకాశం వచ్చింది. అది కూడా అర్జున్ ,విజయ ఆంథోని ల తో నటించటం అదృష్టం. అందరికీ నచ్చుతుందని నమ్ముతామన్నారు. ఆండ్రూ లూయిస్ మాట్లాడుతూ..నాకు తెలుగు రాకున్నా ,తెలుగు వారికి నచ్చె సినిమా తీశాము. విజయ్ ఆంథోని నా స్నేహితుడు. తన వల్లే ఈ సినిమా చేశాను. అర్జున్ గారు మా సినిమాలొకి రావటమే మా మొదటి సక్సెస్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ .టెక్నికల్ గా కిల్లర్ నెక్ట్స్ లెవెల్ మూవీ . నిర్మాత ప్రదీప్ సపోర్ట్ మాకు ప్రధాన బలమన్నారు.
విజయ్ ఆంథోనీ మాట్లాడుతూ.. అర్జున్ గారితొ కలిసి ఈ సినిమా చెయటం నా అదృష్టం. ఆయన యాక్షన్ స్టైల్ కింగ్. ఆండ్రూ నా స్నేహితుడే . అషిమా ఈ సినిమాతో డ్రీమ్ గర్ల్ గా మారుతుంది. ప్రదీప్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీశారు. చదలవాడ శ్రీనివాసరావు గారు నాకు గాడ్ ఫాదర్.భాష్య శ్రీ నాకు మరో సోదరుడు. తను లేకుండా నా సినిమా తెలుగులోకి రాదు.
మంచి సినిమా చేశాము. హాలీవుడ్ తరహా సాంకేతికత మా సినిమాలో చూస్తారన్నారు.మే లో విడుదల చెస్తామన్నారు.
అర్జున్ మాట్లాడుతూ.. కిల్లర్ సినిమాలొ చాలా రొజుల తర్వాత పొలీస్ గా చెస్తున్నా. ఇదొక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. నా పాత్ర కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దర్శకుడి ప్రతిభ, తాను రాసిన కథనం ఈ సినిమాకు ప్రధాన బలం. విజయ్ ఆంథోనీ మంచి మనిషి. కిల్లర్ ఎవరనేది సినిమా చూసి తెలుసుకొవాలన్నారు.
అర్జున్ ,విజయ్ ఆంథోని , అషిమా నర్వాల్ ,నాజర్ ,సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రామ్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి:మాటలు,పాటలు: భాష్యశ్రీ,సంగీతం: సైమన్ కె.కింగ్, ఛాయాగ్రహణం: మ్యూక్స్, ఎటిడింగ్: రిచర్డ్ కెవిన్.ఎ, పోరాటాలు: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: వినొద్ రాజ్ కుమార్, సమర్పణ: బి.ప్రదీప్, నిర్మాణం: దియా మూవీస్, కథ-కథనం- దర్శకత్వం: ఆండ్రూ లూయిస్.
పి.ఆర్.ఓ: సాయి సతీష్.