శ్రీనంద ఆర్ట్స్, శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం దర్పణం. క్రాంతి కిరణ్ వెల్లంకి, వి.ప్రవీణ్ కుమార్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో తనిష్క్‌రెడ్డి , ఎలక్సియస్, సుభాంగి నటిస్తున్నారు. రామకృష్ణ. వెంప దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం రామానాయుడు స్టూడియోస్‌లో చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేశారు. విలేకరుల సమావేశంలో...రమణరెడ్డి మాట్లాడుతూ... ఈ చిత్రంలో చాలా కష్టపడి ఇష్టపడి చేశాము. నేను ఈ చిత్రంలో ఒక క్యారెక్టర్‌ని చేశాను. ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు ఈ చిత్రంలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రొడ్యూసర్‌గారికి బాగా డబ్బులు రావాలని ఆయన మరిన్ని సినిమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సిద్దార్ధ్ మాట్లాడుతూ... నాకు హారర్ థ్రిల్లర్ స్టోరీలంటే చాలా ఇష్టం. నేను ఈ కథ విన్నప్పుడు సర్‌ప్రైజ్ అయ్యాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ ఇది. నేను ఈ చిత్రంలో రెండు పాటలు రాశాను. చాలా బాగా వచ్చాయి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ప్రొడ్యూసర్ క్రాంతి మాట్లాడుతూ... ఇది నా మొదటి చిత్రం మీరందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ బాగా నటించారు. టెక్నీషియన్లు కూడా బాగా కష్టపడ్డారు. మీరందరూ తప్పక మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. హీరో మాట్లాడుతూ... హీరోగా ఇది నా రెండో చిత్రం సకలకళావల్లభుడు తర్వాత నేను నటించిన చిత్రమిది. ట్రైలర్ చూశాను చాలా బాగా వచ్చింది. ఇందులో చాలా థ్రిల్లింగ్ సస్పెన్స్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. నా మొదటి సినిమాకి అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ చిత్రానికి కూడా సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర ట్రైలర్ ను అందరికి షేర్ చేసి కొత్తవాళ్ళను ఎంకరేజ్ చెయ్యండి అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... ముందుగా నాకు సపోర్ట్ ఇచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. కేశవ్‌గారి ద్వారా నాకు క్రాంతిగారు పరిచయం అయ్యారు. క్రాంతిగారు నాకు చాలా సపోర్ట్ చేశారు. అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమా ముఖ్యంగా టెక్నీషియన్స్‌ది. మ్యూజిక్ డైరెక్టర్ అందించిన ప్రతి ఆర్ ఆర్ బిట్ నాతో డిస్‌కస్ చేసి అందించారు. ఎడిటర్ గారు కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా జాగ్రత్తగా చిత్రాన్ని ఎడిట్ చేశారు. ఆయన ప్రస్తుతం నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి పోయారు. ఈ చిత్రం ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్. మా సినిమాలో కామెడీ ఉండదు. కామెడీ దెయ్యం సినిమా కాదు. జబర్దస్థ జోకులు ఉండవు. ఇది సస్పెన్స్ చిత్రం. లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందా అని సస్పెన్స్ ఉంటుంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ టీమ్ అందరూ బాగా హెల్ప్ చేశారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు.