పలు కాంట్రవర్సీ లు క్రియేట్ చేస్తూ తన సినిమాలకు కావలసినంత పబ్లిసిటీ చేసుకునే వర్మ తాజా చిత్రం లక్ష్మిస్ ఎన్టీఆర్ ఈ నెల 29న విడుదలకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే ఎవరెన్ని విధాలుగా నా సినిమాను ఆపాలని ప్రయత్నించినా వెనక్కి తగ్గేది లేదంటూ .. వీలయితే యూ ట్యూబ్ లో అయినా విడుదల చేస్తానంటూ ప్రకటించిన వర్మ నెక్స్ట్ సినిమాపై అప్పుడే ఫోకస్ పెట్టాడు ? ఇంతకీ అయన నెక్స్ట్ సినిమా ఎవరిదో తెలుసా .. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై. తన తదుపరి సినిమా కేసీఆర్ బయోపిక్ తీసేందుకు రెడీ అయ్యాడు? ఇప్పటికే కేసీఆర్ పై రీసెర్చ్ మొదలు పెట్టాడట ! త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటిస్తానని చెప్పాడు.