వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటించిన చిత్రం `సూర్యకాంతం`. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్ జె ఆర్ సిలో జరిగింది. ఈ సందర్భంగా తొలి టిక్కెట్‌ను విజయ్ దేవరకొండకు నీహారిక గిఫ్ట్ ఇచ్చారు. అనంతరం సూర్యకాంతం ఆడియో సీడీలను విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు..