రెండో మ‌న్మ‌థుడు మొదలెట్టాడు

27 Mar,2019

`మ‌న్మ‌థుడు` సినిమాను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని కింగ్ నాగార్జున రూపొందిస్తున్న  మ‌రో  ఎంట‌ర్‌టైన‌ర్ `మ‌న్మ‌థుడు 2`.  మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌(జెమిని కిర‌ణ్‌) నిర్మిస్తున్న `మ‌న్మ‌థుడు 2`  లాంఛ‌నంగా అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. చిత్ర యూనిట్‌తో పాటు అక్కినేని అమ‌ల‌, నాగ‌చైత‌న్య ముఖ్య అతిథులుగా ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు.  అమ‌ల అక్కినేని ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా.. అక్కినేని నాగ‌చైత‌న్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ యూర‌ప్‌లో ప్రారంభం కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించ‌నున్నారు. `RX100` ఫేమ్  చైత‌న్య భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. 

Recent News