డీ గ్లామరైజ్డ్ పాత్రలో దీపికా

25 Mar,2019

యాసిడ్ బాధితురాలి జీవిత కథతో సినిమాకు సిద్ధమైంది బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకునే !! బాలీవుడ్ లో డైనమిక్ లేడి గా  పేరు తెచ్చుకున్న దీపికా ప్రయోగాత్మక చిత్రాలకే మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. పద్మావతీ, బాజీరావు మస్తానీ ఇలా తనదైన శైలి లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజగా చేసే చిత్రానికి ''చపాక్'' అనే టైటిల్ ఖరారు చేసారు. ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. తాజగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. గ్లామర్ క్వీన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న దీపికా ఇలా యాసిడ్ బాధితురాలిగా అండ విహీనురాలిగా నటించడం నిజంగా గొప్ప ప్రయత్నం. ఈ చిత్రాన్ని జనవరి 10, 2020 లో విడుదల చేస్తారట.  

Recent News