ఈ మధ్య వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న హీరో నితిన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా అయన తన నెక్స్ట్ సినిమాకు కమిట్ అయ్యాడు. నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని, వాటిని హృద్యంగా మలిచే చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. భవ్య క్రియేషన్స్ అధినేత వి.ఆనందప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి హోలీ సందర్భంగా హీరో నితిన్ ట్విట్టర్‌లో ప్రకటించారు. హీరో నితిన్ మాట్లాడుతూ ``నేను ఇంతకు ముందే చెప్పినట్టు... నా కొత్త చిత్రాన్ని ప్రకటిస్తున్నాను. సుప్రీమ్లీ టాలెంటెడ్ డైరక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. కీరవాణిగారు స్వరాలను సమకూరుస్తారు.ఏప్రిల్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని మొదలుపెడతాం. మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం`` అని అన్నారు.