చైనాకు వెళుతున్న సైరా

23 Mar,2019

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీగా చిత్రం సైరా.  చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, మరో రెండు నెలల్లో షూటింగు పార్టును పూర్తి చేసుకోనుంది.  సినిమా కోసం మరో యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయవలసి ఉందట. ఈ భారీ పోరాట సన్నివేశాలను చైనాలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ దాదాపు 20 రోజుల పాటు పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది.   వచ్చే నెలలో అక్కడ ఈ షెడ్యూల్  మొదలుకానుంది. ఆగస్టు 15వ తేదీన విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 

Recent News