ఆసుపత్రి పాలైన విజయ్ దేవరకొండ

23 Mar,2019

టాలీవుడ్ సంచలన స్టార్ విజయ్ దేవరకొండ ఆసుపత్రి పాలయ్యాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నాలుగు భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా విడుదల మే 31న ఉండటంతో విరామం లేకుండా షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. దీంతో విజయ్ దేవరకొండ స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని విజయ్ ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నాడు. తనకు విరామం లేకపోవడంతో జ్వరం వచ్చిందని,  త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆసుపత్రికి వెళ్లినట్టు విజయ్ వెల్లడించాడు. ‘‘హోలీని చాలా బాగా జరుపుకొన్నాను. బుధవారం తెల్లవారుజామున ఆరు గంటల వరకూ షూటింగ్‌లోనే ఉన్నా. దీంతో నాకు జ్వరం వచ్చింది. కానీ తొందరగా కోలుకోవాలి. అందుకే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా’ అని తెలిపాడు.

Recent News