హైదరాబాద్ లోనే జాన్

23 Mar,2019

ప్రభాస్ హీరోగా నటిస్తున్న `సాహో` ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మేకింగ్ వీడియోలు షేడ్స్ ఆఫ్ సాహో 1 - 2 అభిమానులు సహా అన్ని వర్గాల్ని మెప్పించాయి. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోంది.  ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్ 20వ సినిమాలోనూ నటిస్తున్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యూరఫ్ నేపథ్యంలో ఒక అందమైన ప్రేమకథా చిత్రమిది.  ప్రభాస్ గెటప్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.   పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటలీలో ఇదివరకూ ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ సాగుతోంది. ఇటలీని ప్రతిబింబించే సెట్స్ వేసి కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందుకోసం కళాదర్శకుడు రవీందర్ సెట్స్ ని డిజైన్ చేశారు. సాహో ఆగస్టులో రిలీజవుతుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి జాన్ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. అన్నట్టు ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నారట. 

Recent News