దిలీప్‌కుమార్ సల్వాది, చత్రపతి శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక, బిత్తిరి సత్తి , రాకేష్ , మల్లాది భాస్కర్ , సుమన్, రజితసాగర్, అరుణ్‌బాబు, ధన్వి కీలక పాత్రల్లో నటించిన చిత్రం `దిక్సూచి`. ఈ చిత్రానికి దిలీప్ కుమార్ సల్వాది దర్శకుడు. నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల నిర్మాతలు. ఈ సినిమా ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. దిలీప్ మాట్లాడుతూ ``ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. మా నిర్మాత రాజుగారు ఆస్ట్రేలియన్ సిటిజన్. ఇటీవల మెల్బోర్న్ లో చాలా మంది తెలుగు ప్రేక్షకుల మధ్య ఓ ఈవెంట్ చేశాం. ఏప్రిల్ మూడో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తాం. 1970లో జరిగిన సెమీ పీరియాడిక్ సినిమా ఇది. నేను చైల్డ్ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశా. హీరోగా నాకు నేనే ఓ పాత్ర రాసుకున్నా. ఇదే నిర్మాతతో, మరో కంపెనీ అసోసియేట్ అయి ఏడాదికి మూడు సినిమాలను నిర్మిస్తాం. ఉగాదికి సినిమాను మొదలుపెడతాం. మా ఆడియో మా దిక్సూచి యాప్ ద్వారా వినవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ కంపెనీ కూడా మొదలుపెట్టాం. మా పాటలు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి. నీలోని చిలకమ్మ పాట వైరల్ అవుతోంది. త్వరలో సినిమా రిలీజ్‌కు ముందు రెయిన్ బో కార్పెట్ ఈవెంట్‌ను నిర్వహిస్తాం. మా సినిమా ప్రమోషన్లో మేం కాకుండా, సినిమా చూసిన వారి చేత ఎక్కువగా మాట్లాడిస్తాం`` అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ``కంటెంట్ ఉన్న సినిమా ఇది. సిగరెట్, మందు వంటివాటిని చూపించడం లేదు. హీరో మంచివాడు. అతనిలోని ప్రతిభ బయటకు రావాలంటే మంచి జరగాలి. అందుకే ఈ సినిమా చేశాం. ఫైట్లు కూడా పెద్దగా లేవు. `జయం`తో అతని పాత్ర నాకు చాలా ఇష్టం`` అని అన్నారు.
అరుణ్ మాట్లాడుతూ ``మంచి పాత్ర చేశాను.సామాన్యులను మనసులో పెట్టుకుని చేసిన సినిమా ఇది. నిర్మాతకు కనకవర్షం కురవాలి. సమాజానికి దిక్సూచి కావాలి`` అని అన్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వంః దిలీప్ కుమార్ సల్వాది, ప్రొడ్యూసర్స్ః నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల, కెమెరాఃజయకృష్ణ, రవికొమ్మి, మ్యూజిక్ డైరెక్టర్ః పద్మనాభ్ భరద్వాజ్, లిరిక్స్ః శ్రీరామ్ తపస్వీ, స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ః దిలీప్‌కుమార్ సల్వాది కట్స్ః దిక్సూచి స్టూడియోస్