ఎవరెస్టు పైకి జాకీచాన్

21 Mar,2019

మార్షల్ స్టార్ గా వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న జాకీచాన్ గురించి అందరికి తెలుసు .. ఆ మద్యే ఓ హిందీ సినిమాలో కూడా నటించిన అయన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే సాహసాం చేయబోతున్నాడు న‌టుడు జాకీచాన్‌. అయితే అది ఓ సినిమా కోసమే. 1960లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన చైనా సాహసికుల బృందం వాంగ్‌ ఫుజు, గొన్పొ, కు యిన్హుల జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘క్లైంబర్స్‌’ పేరుతో రూపొందుతున్న ఆ చిత్రంలో జాకీ చాన్‌తో పాటు మరో చైనీస్‌ అగ్ర నటుడు వు జింగ్‌, యువ నటుడు జింగ్‌ బొరాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హాంగ్‌ కాంగ్‌ దర్శకుడు డేనియల్‌ లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చైనాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Recent News