బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ సినిమా

21 Mar,2019

వరుసగా మూడు పరాజయాలతో టెన్షన్ మీదున్న అక్కినేని చిన్నోడు అఖిల్ తన నాలుగో సినిమాకు రంగం సిద్ధమైంది. వరుస ప్లాప్ ల వల్ల నెక్స్ట్ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపిన అఖిల్ ఫైనల్ గ బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమాకు ఓకే చెప్పాడు. భాస్కర్ చెప్పిన కథ బాగా ఇంప్రెస్ చేసిందట.  ఇప్పటికే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన పనులను 'బొమ్మ   రిల్లు' భాస్కర్ ముగింపు దశకి తీసుకొచ్చాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుండటం విశేషం. కథానాయిక ఎవరనే విషయం త్వరలోనే తెలియనుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది ఈ సినిమా. 

Recent News