సూపర్ స్టార్ రజని కాంత్ మరోసారి శంకర్ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడట ? ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ మరో సినిమా చేయనున్నారనే వార్త కోలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. శంకర్ - రజనీకాంత్ కాంబినేషన్లో 'శివాజీ, రోబో, 2.ఓ' ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అయన రాజకీయాలతో బిజీగా ఉంటాడని అనుకున్నారు .. కానీ మల్లి వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు. దాంతో శంకర్ .. రజనీ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు కార్యరూపం దాల్చనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో రజనీ ఒక సినిమా చేస్తున్నారు. ఆ తరువాత సినిమాను శంకర్ తో చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చారని టాక్. ఈ సినిమా రజని చివరి చిత్రమని చెప్పే అవకాశాలు ఉన్నాయట . త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.