రాజమౌళి మల్టీస్టారర్ కు క్రేజీ టైటిల్స్

21 Mar,2019

ఒక సినిమాను ఎలా మార్కెట్ చేయాలో .. రాజమౌళికి తెలిసినంతగా ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు .. కేవలం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్నను సంధించి .. బాహుబలి రెండో భాగానికి ఏకంగా 2000 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టడం ఒక్క రాజమౌళికే చెల్లింది. ఇక అయన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల కాంబినేషన్ ని పట్టేసి మరో సంచలనానికి తేరా లేపాడు. ట్రిపుల్ ఆర్ టైటిల్ తో ఇప్పటికే సంచలనం రేపుతున్న ఈ సినిమా టైటిల్ విషయంలో ఛాయిస్ అభిమానులకే వదిలేసాడు ..  సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు ఏం పేరు పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద సమస్య. సినిమాకు పేరు పెట్టే బాధ్యతను అభిమానులకె వదిలేసాడు మన జక్కన్న .. సో  ఇంకేముంది... ఫ్యాన్స్ తమదైన శైలిలో పేర్లు పెట్టడం ప్రారంభించారు. వీటిల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. 'రఘుపతి రాఘవ రాజారాం', 'రం రం రుథిరం', 'రామ రావణ రాజ్యం', 'రౌద్ర రణ రంగం' ఇలా ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. వీటిల్లో కొన్నింటిని రాజమౌళి సైతం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. 

Recent News