అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు .. తాజాగా ప్రముఖ నటుడు వెంకటేశ్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో వచ్చిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని సాధించింది. దాంతో పాటు ప్రస్తుతం వెంకటేశ్, నాగచైతన్యతో కలిసి 'వెంకీమామ' అనే మరో మల్టీస్టారర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రవితేజతో కలిసి వెంకటేశ్ మరో మల్టీ స్టారర్ చేయనున్నారనీ, ఈ సినిమాకి వీరు పోట్ల దర్శకత్వం వహించనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నది తేలింది. నిర్మాత అనిల్ సుంకర కోసం వెంకటేశ్ ఒక సినిమా చేయవలసి ఉందట. అనిల్ సుంకర రిఫరెన్స్ తో దర్శకుడు వీరు పోట్ల ఒక కథను వెంకటేశ్ కి వినిపించాడట. అయితే ఈ విషయంపై వెంకటేశ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టాక్ . ఈలోగానే ఇది మల్టీ స్టారర్ అనీ .. వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే వార్తలు షికారు చేశాయి. ప్రస్తుతానికి ఇది మల్టీ స్టారర్ కాదనే విషయం మాత్రం స్పష్టమైపోయింది.