అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ `జెస్సీ`. ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ ప్రై.లి. బ్యానర్‌పై వి.అశ్విని కుమార్ దర్శకత్వంలో శ్వేతా సింగ్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 15న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో...పివిఆర్ సినిమా ఉదయ్ మాట్లాడుతూ - ``టీజర్ చూశాను చాలా బాగా నచ్చింది. వెంటనే శ్వేతగారికి మేడమ్ హారర్‌లో ది బెస్ట్ మూవీ వస్తుంది అని చెప్పాను. మేడమ్ రిలీజ్ టైంలో చిన్న మూవీ కదా! చూసి రిలీజ్ చేయండి అన్నారు. కానీ ఇది నాకు చాలా పెద్ద మూవీగా కనపడుతుంది మేడమ్ అని చెప్పి విడుదల చేశాం. ఈ సినిమాకు ఇంత పెద్ద రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయని ఊహించలేదు. వన్ షోతో స్టార్ట్ అయిన మల్టీప్లెక్స్‌లో 7 షోస్ రన్ అవుతుంటే... వన్ షోతో స్టార్ట్ అయిన సింగిల్ స్క్రీన్స్ 4 షోస్‌తో రన్ అవుతున్నాయి. మొదటి మూడు రోజుల్లో ప్రతి రోజూ కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. శుక్రవారం వచ్చిన కలెక్షన్స్ కంటే ఈరోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి`` అన్నారు. నిర్మాత శ్వేతా సింగ్ మాట్లాడుతూ - ``చాలా కన్‌ఫ్యూజన్స్ మధ్య సినిమాను విడుదల చేశాం. అయితే ఆడియెన్స్ టాక్ విన్న తర్వాత మేం పడ్డ కష్టమంతా మరచిపోయాం. పివిఆర్ సినిమాస్ వారు మాపై నమ్మకంతో సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. వండర్స్ క్రియేట్ చేస్తుందని వారు నమ్మారు. వారి నమ్మకం ఈరోజు నిమైంది. ప్రేక్షకులు మా సినిమాను ఇలాగే ఆదరిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు. దర్శకుడు అశ్వినికుమార్.వి మాట్లాడుతూ - ``సినిమా రిలీజ్‌కు చాలా సమస్యలను ఫేస్ చేశాం. చివరకు పివిఆర్ సినిమా ఉదయ్‌గారిని కలిశాం. చిన్నగా విడుదలైన మా సినిమా హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. మంచి కాన్సెప్ట్ ఉంటే ఆదరిస్తామని ప్రేక్షకులు నిరూపించారు. ప్రేక్షకులు ఇంకా మా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు. ఆషిమా నర్వాల్ మాట్లాడుతూ - ``ఇంత పెద్ద రెస్పాన్స్ రావడానికి ప్రేక్షకులు అందించిన ప్రోత్సాహమే. మీడియా ప్రతినిధులు కూడా తమ వంతుగా సపోర్ట్ చేశారు. జెన్యూన్ సినిమాలో భాగమైన ఎంటటైర్ యూనిట్‌కు థాంక్స్. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసిన దర్శకుడు అశ్విని కుమార్, నిర్మాత శ్వేతా గారికి థాంక్స్. టీం ఎఫర్ట్ సక్సెస్ ఇవ్వడం ఇంకా ఆనందాన్నిచ్చింది`` అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ - ``లాంగ్ జర్నీ. ప్రేక్షకులకు థాంక్స్. అమేజింగ్ రెస్పాన్స్ ఇచ్చారు. నిర్మాత శ్వేత, డైరెక్టర్ అశ్విన్ సినిమాను నమ్మి నిలబడ్డారు. ఈ సినిమాను ఐదేళ్ల క్రితం నాకు డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమా తర్వాత నేను 12 సినిమాలకు పనిచేశాను. అసలు సినిమా ఏమవుతుందోనని భయపడ్డాను. కానీ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం ఆనందంగా ఉంది`` అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.