తెలుగులో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’కి రీమేక్‌గా తమిళంలో అయోగ్య పేరుతో చిత్రం రూపొందుతుంది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా రాశీ ఖన్నా అలరించనుంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించారు. కానీ ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. ఇటీవల ఒక పాటను చిత్రీకరిస్తుండగా విశాల్ కాలికి గాయమైంది. విశాల్ విశ్రాంతి తీసుకోవలసి రావడంతో షూటింగుకు అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ముందుగా అనుకున్న సమయానికి షూటింగు పూర్తిచేయలేకపోతున్నందు వలన విడుదల తేదీని వాయిదా వేశారు. మే 10వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.