మూడో బిగ్ బాస్ గా నాగార్జున

20 Mar,2019

ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ తో తెలుగులో బిగ్ బాస్ షో కి మంచి క్రేజ్ ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఆ తరువాత రెండో సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించి క్రేజ్ విషయం పక్కన పెడితే .. కొన్ని కొన్ని వివాదాలతో అతను తప్పుకోవడంతో .. తాజాగా మూడో సీజన్ కోసం ఎవరిని పెట్టాలా అన్న ఆలోచనలో ఉన్న టీమ్ ఫైనల్ గా కింగ్ నాగార్జున ను ఎంపిక చేశారని టాక్.   ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కోసం  గట్టిగానే ట్రై చేసింది కానీ తను సైతం ససేమిరా అన్నాడు. కొంతకాలం వెంకటేష్ పేరు వినిపించింది.   . మీలో ఎవరు కోటీశ్వరుడిని నాగ్ నడిపించిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా దగ్గర చేసింది.  అందుకే ఫైనల్ గా నాగ్ ని సంప్రదించగా మా ఛానల్ తో గతంలో కొనసాగిన ప్రగాఢమైన అనుబంధం దృష్ట్యా ఎస్ చెప్పినట్టు టాక్. ఇది మరికొద్ది రోజుల్లో అధికారికంగా వెల్లడి కావొచ్చు. జూన్ నుంచి ప్రారంభం కానున్నట్టు టాక్. 

Recent News