ప్రేమ అంత ఈజీ కాదు టీజర్‌ విడుదల

19 Mar,2019

రాజేష్‌కుమార్‌, ప్రజ్వాల్‌ జంటగా పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై  టి. అంజయ్య సమర్పణలో ఈశ్వర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమ అంత ఈజీ కాదు’. టి.నరేష్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను సోమవరం హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది. మనసుకి నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకోవడం ఎంత కష్టమో తెలిపే సినిమా ఇది. ఖోఖో’. ప్లాష్‌ న్యూస్‌, ‘వెతికా నేను నా ఇష్టంగా’ వంటి  చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్న రాజేష్‌కుమార్‌ ఇందులో అద్భుతంగా నటించారు. కన్నడలో మూడు విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రజ్వాల్‌ పువ్వామా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అని చెప్పారు.  దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రేమ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ మఽధ్య సాగే డ్రామా ఇది. నిర్మాతలు రాజీ పడకుండా నిర్మించారు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. త్వరలో పాటల్ని విడుదల చేసి, ఈ నెలాఖరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు. ధనరాజ్‌, రాంప్రసాద్‌, ముక్తార్‌ఖాన్‌ నటించిన ఈ చిత్రానికి ఛాయగ్రహణం: చక్రి, సంగీతం: జై.యం, ఎడిటింగ్‌ : శ్రీనివాస్‌ కంబాల. 

Recent News