నిత్యామీనన్‌ బాలీవుడ్ ఎంట్రీ

19 Mar,2019

మలయాళీ భామ నిత్యామీనన్‌ దక్షిణాది నాలుగు భాషల చిత్రాల్లో నటించి…తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే అంగీకరిస్తుందన్న పేరున్న ఆమెకు తెలుగులో కూడా పలు చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయి. ఈ మధ్య కాలంలో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయక పోయినా తమిళ, మలయాళ సినిమాలలో నటిస్తూ ఆమె బిజీగానే ఉంది. ఈ నేప థ్యంలో మొదటిసారి ఆమెకు బాలీవుడ్‌ నుంచి పిలుపు రావడంతో పచ్చజెం డా ఊపేసింది. అక్షయ్‌కుమార్‌, విద్యాబాలన్‌, సోనాక్షిసిన్హా, తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మిషన్‌ మంగళ చిత్రంలో నిత్యామీనన్‌కు కూడా ఓ ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఈ చిత్రంలోని ఓ పాత్రలో నిత్యామీనన్‌ అయితే అన్నివిధాల కరెక్ట్‌ అని అక్షయ్‌కుమార్‌ సిఫారసు చేశారట. దాంతో ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని చిత్రబృందం లక్ష్యంగా నిర్దేశించుకుంది.  

Recent News