ఆది సాయికుమార్, వేదిక హీరో హీరోయిన్లుగా తెలుగు, తమిళ బై లింగ్వుల్ చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. కార్తీక్ విఘ్నేశ్ దర్శకుడు. హీరోయిన్ వేదిక నటిస్తున్న నాలుగో తెలుగు చిత్రమిది. మార్చి 25 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చిత్తూరు జిల్లాలోని తలకోనలో ప్రారంభం కానుంది. రోబో, 2.0 చిత్రాలకు అసోసియేట్ కెమెరామెన్‌గా పనిచేసిన గౌతమ్ జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సి.సత్య సంగీతాన్ని అందిస్తున్నారు. `అర్జున్ సురవరం` చిత్రాన్ని నిర్మించిన అరా సినిమాస్ పై.లి. బ్యానర్‌పై నిర్మితమవుతున్న రెండో చిత్రమిది. నిర్మాణంలో న్యూ ఏజ్ సినిమా, తిరు కుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అసోసియేట్ అవుతున్నారు. ఈ సినిమా మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.