గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'పరారి'. సాయి శివాజీ దర్శకత్వంలో గాలి.వి.వి. గిరి నిర్మిస్తున్నారు. ''రన్ ఫర్ ఫన్ '' అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం ద్వారా యోగేశ్వర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. 'పరారి' చిత్రం ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ వేడుక ఆదివారం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసి ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఫస్ట్‌లుక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ''హీరోగా పరిచయం అవుతున్న యోగేశ్వర్ బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథని ఎంచుకున్నారు. పాత్రలో లీనమైన యోగేశ్వర్ చక్కని నటన ప్రదర్శించారు. ఎక్కడా కొత్త అనే ఫీలింగ్ లేకుండా చాలా ఈజ్‌తో చేశాడని ప్రశంసించారు. చిత్ర దర్శకుడు సాయి శివాజీ డాన్స్ మాస్టర్‌గా పరిచయం ఉందని, దర్శకునిగా మంచి కథను ఎంపికచేసుకుని చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిర్మాత గిరిగారు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా భారీ ఎత్తున నిర్మించారని'' సి.కల్యాణ్ పేర్కొన్నారు.
సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ ''ఈ చిత్ర నిర్మాత గిరి చాలా సంవత్సరాలుగా నా అభిమాని. వారి అబ్బాయితో సినిమా చేయాలని అంటుండే వాడు. నేనే వాయిదా వేస్తూ వచ్చాను. కానీ ఆయనలో పట్టుదల చూసి మంచి కథను ఎన్నుకుని ఈ చిత్రం చేశాం యోగేశ్వర్ క్యారెక్టర్‌కు అనుగుణంగా కథ, కథనం ఉంటుంది. దర్శకుడు శివాజీ ఎంతో శ్రమపడి చిత్రాన్ని అద్యంతం రమణీయంగా తీర్చిదిద్దారు. ఇతర పాత్రధారులు అతిథి, షియాజీ షిండే, శ్రవణ్, రఘు, జీవా, శివాని, మకరందేష్ పాండే వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. నేనూ ఒక ముఖ్యపాత్ర పోషించాను. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ మంచి బాణీలు ఇచ్చారు'' అని అన్నారు.
చిత్ర నిర్మాత జి.వి.వి.గిరి మాట్లాడుతూ ''చిత్ర నిర్మాణంలో వెన్నంటి వుండి పూర్తి సహకారాన్ని అందించిన మా హీరో సుమన్ గారిని ఎప్పటికీ మరువలేము. హీరోగా పరిచయం అవుతున్న యోగేశ్వర్ పాత్రను అర్థం చేసుకుని నటించాడు. పరారి చిత్రీకరణ హైదరాబాద్‌తో పాటుగా విదేశాల్లో జరిగింది. ఒక పాట మినహా సినిమా పూర్తయింది. కొత్త హీరోకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలని'' అని అన్నారు.
హీరో యోగేశ్వర్ మాట్లాడుతూ ''సుమన్ అంకుల్ కథ విషయంలోగానీ, చిత్రీకరణ సమయంలో కానీ సొంత సినిమాలా భావించి సహకరించారు. నటించేపుడు సహ నటుల నుండి ఎంతో నేర్చుకున్నాను. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారు'' అని చెప్పారు. దర్శకుడు సాయి శివాజీ మాట్లాడుతూ ''పరారి చిత్రం అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. రన్ ఫర్ ఫన్ అనేది ఉప శీర్షిక. వినోదానికి ప్రాధాన్యతనిస్తూ థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించాం'' అని చెప్పారు.
ఈ చిత్రంలో యోగేశ్వర్, అతిథి, సుమన్, భూపాల్, రఘు, షియాజీ షిండే, అలీ, శ్రవణ్, జీవా, శివాని, మకరందేష్ పాండే, జబర్దస్త్ శీను, కల్పలత, మాధవి, నీలిమా తదీతరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మహిత్ నారాయణ్, ఛాయాగ్రహణం: అంజి, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, స్టంట్స్: నందు, సమర్పణ: గాలి ప్రత్యూష, నిర్మాత: గాలి వి.వి.గిరి, రచన, దర్శకత్వం సాయి శివాజీ.