శరవేగంగా అసలేం జరిగింది

19 Mar,2019

శ్రీరాం, సంచితా పడుకునే హీరోహీరోయిన్లుగా ఎక్సోడస్ మీడియా నిర్మిస్తున్న అసలేం జరిగింది. కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు. నెర్రపల్లి వాసు అద్భుతమైన కథను సమకూర్చారు. ఈ  సినిమా సెకండ్ షెడ్యూల్ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు అందమైన లొకేషన్లలో ఇటీవల ప్రారంభమైంది. రెండు పాటలు, ైక్లెమాక్స్ సీన్స్, పోరాటాలు, సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాల్ని ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తామని నిర్మాత కె.నీలిమా తెలిపారు. మార్చి 31 లోపు టాకీ భాగం పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఎడిటింగ్, గ్రాఫిక్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని శరవేగంగా జరుపుతున్నామని చెప్పారు. లవ్, సస్పెన్స్ జానర్ కింద నిర్మితమయ్యే ఈ సినిమా తమకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని హీరోహీరోయిన్లు శ్రీరాం, సంచితాలు తెలిపారు.కో-ప్రొడ్యూసర్ కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాటలు, ఫైట్లు, యాక్షన్ సీన్లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయన్నారు. ప్రధానంగా యూత్‌ని ఆకర్షించే విధంగా సినిమా పాటలుంటాయన్నారు. వీటిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరిస్తున్నామని చెప్పారు. ఫైట్ మాస్టర్ శంకర్ యాక్షన్ సీన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని తెలిపారు.

Recent News