అభినవ మన్మధుడి కింగ్ నాగార్జున సినిమాల పరంగా అంతకంతకు స్పీడ్ పెంచేస్తున్నారు. ఇన్నాళ్లు స్క్రిప్టు సహా చాలా విషయాల్లో క్లారిటీ కోసం వేచి చూసిన నాగార్జున ఇకపై సెట్స్ కెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా మన్మధుడు 2 నా? లేక బంగార్రాజు సెట్స్ కెళతాడా? అంటూ కొంతకాలంగా అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఈ విషయంలో కింగ్ పూర్తి క్లారిటీకి వచ్చేశారని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 25న మన్మధుడు 2 మొదలవుతోంది. అదే రోజు నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళతారట. అందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చి.ల.సౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్క్రిప్టు విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చేశారట. స్క్రిప్టు నాగార్జునకు నచ్చింది అందుకే ఇక సెట్స్ కెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. 2020 సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా బరిలో దిగుతున్నారట. ఇప్పటికే అందాల రకుల్ ప్రీత్ కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే.