కబాలి వంటి భారీ బడ్జెట్ చిత్రాలని నిర్మించిన కలైపులి ఎస్ థాను నిర్మాణంలో హిప్పీ అనే సినిమా చేస్తున్నాడు ఆర్ ఎక్స్ 100హీరో కార్తిక్. బైలింగ్యువల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘కబాలి, మల్లన్న , తేరి’వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతుంది. తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఈ చిత్రంలో కార్తికేయ బాక్సర్‌గా కనిపిస్తాడని సమాచారం. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఇందులో కార్తికేయ సరసన ముంబై భామలు దిగాంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ లు హీరోయిన్స్ . ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకి సంబంధించిన టీజర్‌ని మార్చి 20న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం పోస్టర్ ద్వారా తెలిపింది. ఈ పోస్టర్ అభిమానులని ఆకట్టుకుంటుంది.