నా పేరు సూర్య తరువాత చాల గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమాకు కమిట్ అయినా విషయం తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్ సిద్దం అయ్యిందని - ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుందని సమాచారం అందుతోంది. దాంతో పాటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని .. టాక్. అన్నట్టు ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది .. ఇంతకీ టైటిల్ ఏమిటో తెలుసా .. '' నేను నాన్న''. అవును ఇదే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ తోనే ఈ చిత్రం కూడా ఉంటుందని - సన్నాఫ్ సత్యమూర్తి తరహాలో తండ్రికి అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తిగా హీరో పాత్ర ఉంటుందని అందుకే ఈ చిత్రానికి నేను నాన్న అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.