ఏప్రిల్ 5న మజిలీ 

17 Mar,2019

నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. పెళ్లి తరువాత అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న తొలి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాహూ గారపాటి, హరీష్ పెద్ది సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ ద్వితీయ కథానాయికగా నటిస్తోంది.  ఇప్పటికే విడుదలైన టీజర్ కోటికి పైగా వ్యూస్‌ను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 5న ‘మజిలీ’ విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో ఇక నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నామని చిత్రబృందం వెల్లడించింది.

Recent News