తాను దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు సర్టిఫికేషన్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డు కావాలనే తాత్సారం చేస్తోందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డుపై కేసు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఏపీలో తొలిదశ పోలింగ్ ముగిసేవరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా సెన్సారింగ్ ను వాయిదా వేస్తామని బోర్డు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డుకు కేవలం సర్టిఫికెట్ జారీచేసే అధికారం మాత్రమే ఉందనీ, సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేసే అధికారం లేదని స్పష్టం చేశారు. సెన్సార్ బోర్డు తన సినిమాను చట్టవిరుద్ధంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఈ మేరకు వర్మ ట్విట్టర్ లో స్పందించారు.