చేతన్ మద్దినేని హీరోగా డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నరేష్ కుమార్ దర్శకత్వంలో మంజునాథ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం `1st ర్యాంక్ రాజు`.విద్య 100% బుద్ధి 0% ఉప శీర్షిక. ఈ సినిమా ఫస్ట్ లుక్, లోగో, టీజర్‌ను `మా` అధ్యక్షుడు నరేష్, డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో... మా అధ్యక్షుడు వి.కె.నరేష్ మాట్లాడుతూ - ``ఒక అద్భుతమైన పాయింట్‌ని ఎంటర్ టైనింగ్‌గా చెప్పడం చాలా గొప్ప విషయం. కన్నడలో చాలా పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే టీం తెలుగులో చేయడం మొదటి సక్సెస్‌గా నేను భావిస్తున్నాను. త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల వంటి దర్శకులు నాకు మంచి పాత్రలను క్రియేట్ చేస్తున్న తరుణంలో మారుతి, ఇప్పుడు నరేష్ కుమార్ వంటి యంగ్ డైరెక్టర్స్ కూడా మంచి మంచి పాత్రలను క్రియేట్ చేస్తున్నారు. కన్నడంలో నేను సినిమా చూశాను. అదే పాత్రను తెలుగులో చేయడానికి చాలా థ్రిల్ అయ్యాను. అఆ సినిమాతో కూతుర్లందరూ ఇలాంటి తండ్రి ఉంటే బావుండేదనుకున్నారు.. లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాతో అబ్బాయిలందరూ ఇలాంటి తండ్రి ఉండాలనుకునేలా అబ్బాయిల్లో కూడా ఫ్యాన్ పెరుగుతుంది. ఈ సినిమా చార్లి చాప్లిన్ ఫార్ములాతో తెరకెక్కింది. ఎందుకంటే చార్లి చాప్లిన్ కామెడీ చేస్తున్నా.. వెనుకు చిన్న పెయిన్ ఉంటుంది. అలాంటి ఫార్ములాతో చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే ఫార్ములాతో తెరకెక్కించారు.ఇలాంటి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. చేతన్ తన పాత్రను ఫీలై అద్భుతంగా చేశాడు. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. దర్శకుడు నరేష్ అద్భుతంగా సన్నివేశాలను ఎంటర్‌టైనింగ్‌వేలో తెరకెక్కించాడు. కశిష్ వోరా చక్కగా నటించింది. శ్రవణ్ చాలా మంచి డైలాగ్స్ రాశారు. ఇక మంజునాథ్‌గారు తెలుగు సినిమాలపై అభిమానంతో ఓ మంచి చిత్రాన్ని తెలుగులో నిర్మించాలనుకోవడం ఆయనకున్న టేస్ట్‌ను తెలియజేస్తుంది. ఆయనకు తెలుగులో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ - ``కన్నడంలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. చాలా మంది ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ట్రై చేసినా కూడా మంజునాథగారు తెలుగులో తనే నిర్మించాలని కొత్త వాళ్లైనా కూడా సినిమా చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకు థాంక్స్. నేను సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. నేటి కాలంలో తల్లిదండ్రులు వారి పిల్లలను చదవు కోసం ఎలా ప్రెషర్ చేస్తున్నారు.. పిల్లల మానసిక పరిస్థితేంటి? అనే విషయాలను ఎంటర్టైనింగ్గా చూపించారు. సినిమాను సమ్మర్లో విడుదల చేయబోతున్నారు. మంజునాథ సహా ఎంటర్ యూనిట్‌కు అబినందనలు`` అన్నారు.
నిర్మాత మంజునాథ వి.కందుకూర్ మాట్లాడుతూ - ``ఈ చిత్రంలో కన్నడలో చాలా పెద్ద హిట్ అయ్యింది. నేను చిన్నప్పట్నుంచి తెలుగు సినిమాలను బాగా ఇష్టపడేవాడిని. ఇప్పుడు తెలుగులో సినిమాను ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికీ నచ్చే సపోర్ట్. నా ఫ్యామిలీ సహా అందరూ ఈ సినిమా విషయంలో నాకు సపోర్ట్ చేశారు. ఇలా అందరూ సపోర్ట్ చేస్తే.. తెలుగులో మరిన్ని సినిమాలను నిర్మించడానికి నేను సిద్ధం`` అన్నారు.
చిత్ర దర్శకుడు నరేష్ వి.కె మాట్లాడుతూ - ``కన్నడంలో నేను చేసిన ఫస్ట్ ర్యాంక్ రాజు మా జీవితాలను మార్చేసింది. సినిమా ఏకంగా వందరోజులు సక్సెస్‌ఫుల్‌గా ఆడింది. మంజునాథగారు సపోర్ట్‌తోనే అది సాధ్యమైంది. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ 1 శాతం ఉంటే వాళ్లకే కాదు.. మిగిలిన 99 శాతం పిల్లలకు కూడా నచ్చే సినిమా. కన్నడలో ప్రతి స్టూడెంట్, వారి తల్లిదండ్రులతో చూసిన సినిమా. విద్యే కాదు.. బుద్ది ఉండాలని చెప్పే సినిమా. సినిమాలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న మెసేజ్ కూడా ఉంటుంది`` అన్నారు.
హీరో చేతన్ మద్దినేని మాట్లాడుతూ - ``ప్రతి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ బయోపిక్ ఇది. ప్రతి ఒక్కరూ వారి లైఫ్‌లో ఎక్కడో ఒకచోట నెంబర్ వన్ అయ్యుంటారు కాబట్టి వారందరి బయోపిక్ ఇది. మా డైరెక్టర్ నరేష్కుమార్గారి కథ ఇది. తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా. ఒక పక్క అమాయకంగా, మరో పక్క అన్నీ తెలుసు అనేలా నటించే చాలెంజింగ్ పాత్రలో నటించడం కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.