డియర్ కామ్రేడ్ టీజర్ విడుదల 

17 Mar,2019

టాలీవుడ్ సెన్సషనల్ స్టార్  విజయ్ దేవరకొండ తాజాగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా టీజర్ ను హీరో విజయ్ దేవరకొండ ఈరోజు రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా మాస్ లుక్ తో అదరగొట్టేశాడు.  విజయ్ కు జోడీగా రష్మిక మందన నటిస్తోంది. ఇప్పటికే టీజర్ సంచలనం రేపుతోంది. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ పై భరత్ కమ్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.  

Recent News