మోహన్ రాజా దర్శకత్వంలో విజయ్ 

15 Mar,2019

కోలీవుడ్‌  స్టార్‌ హీరో విజయ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్‌ విజయం సాధిస్తోంది. విజయ్‌ చేసిన ప్రయోగాలకు కూడా అభిమానులు అండగా నిలిచారు. ఇటీవలే వచ్చిన సర్కార్‌ సినిమా రికార్డ్‌ స్థాయి కలెక్షన్లు రాబట్టింది. రజనీకాంత్‌ తర్వాత స్థానం విజయ్‌ దే అని అభిమానులు అంటారు. కానీ ఈ మధ్య మరో హీరో అజిత్ నటించిన సినిమాలు సైతం భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి. దాంతో విజయ్‌, అజిత్ మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత మోహన్‌ రాజా దర్శకత్వంలో నటించే సినిమా మొదలవుతుందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. మోహన్‌ రాజా, విజయ్‌ కలిసి గతంలో వేలాయుధం అనే సినిమా చేశారు. ఆ మధ్య మోహన్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన తనీ ఒరువన్‌ సినిమా భారీ విజయం సాధించింది. దాంతో మోహన్‌ ఇతర హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇంతకాలానికి విజయ్‌తో సినిమా చేసేందుకు కుదిరిందని అంటున్నారు. మోహన్‌ రాజా ఎవరో కాదు తెలుగులో హనుమాన్‌ జంక్షన్‌, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హిట్లర్‌ సినిమాలను నిర్మించిన ఎడిటర్‌ మోహన్‌ తనయుడు.

Recent News