సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఇంకా రెండు పాటలను మాత్రమే చిత్రీకరించవలసి వుంది. ఏప్రిల్ రెండవ వారంలో ఈ పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. దాంతో పాటు 'ఉగాది' కానుకగా ఏప్రిల్ 6వ తేదీన టీజర్ వదలాలనే ఆలోచనలో వున్నారు. దిల్ రాజు .. అశ్వనీదత్ .. పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి , దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. మే 9వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. మూడు డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు కనిపించనుండటంతో, అభిమానులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.