యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రాంచరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్ చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ప్రస్తుతం ఈ ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో... దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ - ''థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్ సినిమాలో ఏం చూడబోతున్నాం. ఎలాంటి కంటెంట్ చూడబోతున్నాం. ఈ సినిమా ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్ మనకు ఇవ్వబోతుంది అనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. అలాంటివి ఉండేలా చూసుకోవాలి. అందుకనే నేను ఎప్పుడూ ఆడియెన్స్‌కు ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్ రాబోతుందని ముందే చెప్పడానికి ట్రై చేస్తుంటాను. సాధారణంగా షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే అలాంటి విషయాన్ని నిర్వహిస్తాను. ఈ సినిమా విషయానికి వస్తే కొన్ని కారణాలతో ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఇంకా బిగినింగ్ స్టేజస్‌లోనే ఉన్నాను. ప్లాట్ పాయింట్ విషయానికి వస్తే.. 1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఇంగ్లీష్ చదువులే కాకుండా పురాణాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. యోగా ఎక్స్‌పర్ట్. అయితే యుక్త వయసులో ఉండగానే ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారని అంటారు. తీర్థయాలకని అంటారు.. తపస్సుకని అంటారు.. దేశం కోసం త్యాగం చేశారని అంటారు. ఎక్కడికి వెళ్లారో, ఏం చేశారో తెలియదు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన గిరిజనుల బాగు కోసం స్వాతంత్య్ర ఉద్యమం స్టార్ట్ చేశారు. అక్కడి నుండి అన్నీ విషయాలు మనకు తెలుసు. ఆయనెలా పోరాడారు, గెరిల్లా వార్, పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడం, గన్స్ తీసుకోవడం, జనాల్ని ఉత్తేజ పరచడం. తర్వాత బ్రిటీషర్స్ చేతిలో చనిపోయారు. ఇవన్నీ మనకు తెలిసినవే. అల్లూరి సీతారామరాజు పుట్టిన రెండు, మూడేళ్ల గ్యాప్‌లో అంటే 1901లో ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీమ్ పుట్టారు. ఆయన కూడా యుక్త వయసులో ఉండగా.. ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వెళ్లిన తర్వాత ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. వెళ్లే ముందు ఆయన నిరక్షరాస్యుడు.. తిరిగి వచ్చిన తర్వాత చదువుకున్నవాడిగా తిరిగొచ్చాడు. ఆయన కూడా నిజాం ప్రభుత్వం మీద, గిరిజనుల స్వాతంత్య్రం పోరాడారు. అల్లూరి సీతారామరాజు ఎలాగైతే ఫైట్‌చేశారో ఆయన కూడా అలాగే గెరిల్లా వార్, పోలీస్ స్టేషన్‌పై దాడి, గన్స్ తీసుకోవడం, ప్రజలను ఉత్తేజపరచడం చేశారు. వీరిద్దరి గురించి చదువుతున్నప్పుడు యాదృచ్చికంగా ఇద్దరూ ఒకే టైంలో పుట్టడం, ఒకే టైంలో వెళ్లిపోవడం.. వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలియకపోవడం... వచ్చిన తర్వాత ఒకేలా ఫైట్ చేయడం చూసి నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. దాన్ని మా సినిమాలో ప్లేస్ చేశాం. ఇద్దరు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే ఇద్దరు పోరాట యోధులు చరిత్రలో ఎప్పుడూ కలవని వారు.. ఒకరికొకరు సంబంధం లేనివాళ్లు, నిజంగా మనకు తెలియని టైంలో వాళ్లు కలుసుకుంటే ఒకళ్లకు ఒకరు ఇన్‌స్పిరేషన్ అయ్యుంటే.. తర్వాత వాళ్లు బ్రిటీష్ ప్రభుత్వంపై, నిజాం ప్రభుత్వంపై పోరాడారు. ఆ పోరాటం వాళ్ల మధ్య ఏర్పడిన స్నేహం ద్వారా ఏర్పడి ఉంటే ఎలా ఉంటుందనేది నాకు ఆసక్తికరంగా అనిపించింది. అదే మా సినిమాలో కథగా పెట్టబోతున్నాం. ఇది మనకు తెలిసిన స్టోరీ కాదు.. తెలియని స్టోరీ. ఫిక్షియస్ స్టోరీ. కంప్లీట్‌గా ఫిక్షనల్ స్టోరీ అది కూడా మనకు తెలిసిన ఇద్దరు రియల్ హీరోస్ గురించిచెప్పడమే ఈ సినిమా. ఇది లార్జ్ స్కేల్‌లో చేస్తున్నాం. చిన్న స్కేల్‌లో చేయడం కాకుండా పెద్ద ప్లాట్ ఫాంలో సినిమాను చేస్తున్నాం. చాలా రీసెర్చ్ చేశాం. 19వ దశాబ్దంలో జరిగిన కథ.. ఉత్తర బారతదేశంలో జరిగిన కథ. చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఆరోజుల్లో జీవన విధానం ఎలా ఉండేది? దుస్తులు ఎలా ఉండేవి? వర్తకం ఎలా ఉండేది? ఇలాంటి విషయాలపై చాలా పెద్ద రీసెర్చ్ చేశాం. అందుకే ఈ సినిమా స్టార్ట్ చేయడానికి సమయం పట్టింది. ఇంత పెద్ద హీరోలున్న ఈ సినిమాకు సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా పెద్దగా, స్ట్రాంగ్‌గా ఉండాలి. అజయ్‌దేవగణ్‌గారు ఈ సినిమాలో స్ట్రాంగ్ రోల్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. ఈగ సమయంలో ఆయనతో పరిచయం ఉంది. ఆయనకు మెసేజ్ పెట్టి వెళ్లి కలిశాను. వెళ్లి క్యారెక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేయగానే. ఇమీడియట్‌గా డేట్స్ ఎప్పుడు కావాలని అడిగారాయన. ఆయన ఈ సినిమాలో పార్ట్ కావడం పట్ల చాలా ఎగ్జయిట్ అయ్యారు. ఫాష్ బ్యాక్‌లో వచ్చే ఓ పవర్‌ఫుల్ పాత్రలో అజయ్‌దేవగణ్ నటిస్తున్నారు. అలియా భట్, చరణ్ జతగా నటిస్తుంది. ముంబై నుండి వస్తుంటే మేం ఎయిర్‌పోర్టులో కలుసుకున్నాం. అప్పుడే మాట్లాడుకున్నాం. నీ పాత్ర ఇలా ఉంటుందని రఫ్‌గా చెప్పాను. నేను ఏ పాత్ర అయినా చేస్తానంది. తర్వాత తనతో చర్చలు జరిపాం. తన క్యారెక్టర్ చేయడానికి ఎగ్జయిట్ అయ్యింది. డైజీ ఎడ్గర్ జోన్స్ అనే బ్యూటీఫుల్ యంగ్ లేడీ, తారక్ పక్కన నటిస్తుంది. సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాకు ఆయన పాత్ర బ్యాక్‌బోన్‌లా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యాస్ట్ దొరికింది. ముందు ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. అయితే డిస్ట్రిబ్యూటర్స్, ఫ్యాన్స్ నుండి టైటిల్ చాలా బావుంది అని రెస్పాన్స్ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ అనే ఎలా పెడదాం అని ఆలోచించాం. అయితే అన్నీ భాషల్లో ఆర్ ఆర్ ఆర్ కామన్ టైటిల్‌గా ఉంటుంది. అయితే దానికి వివరణాత్మక టైటిల్ మాత్రం తెలుగులో, హిందీ, తమిళం, మలయాళ భాషలకు తగిన విధంగా ఒక్కొక్క స్టయిల్లో ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ అనుకోగానే అందరూ ట్విట్టర్ , ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో అందరరూ కొన్ని సలహాలు ఇచ్చారు. సరే ప్రేక్షకులు ఇంత ఆసక్తిగా ఉన్నారు కదా.. ఆర్ ఆర్ ఆర్ కి వాళ్లనే ఎక్స్‌పెన్‌షన్ ఇవ్వమని అడిగాం. మేం ఊహించిన దానికంటే బావుంటే, కచ్చితంగా ఆ టైటిల్‌తోనే ముందుకెళతామని అనుకుంటున్నాం. నా సినిమాలో అల్లూరి సీతారామరాజుకి యంగర్ వెర్షన్‌గా రామ్‌చరణ్.. కొమరం భీమ్‌కు యంగర్‌వెర్షన్‌గా తారక్ కనిపిస్తారు. ఇద్దరూ ఆ క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్ కావడం ఆనందంగా ఉంది'' అన్నారు.
మెగాపవర్‌స్టార్ రాంచరణ్ మాట్లాడుతూ - ''నేను రియాలిటీలో లేను. ఇది నిజమా? కాదా? అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుండో రాజమౌళిగారితో పనిచేయాలని అనుకోవడం.. నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్, దగ్గరైన వ్యక్తి, చాలా చాలా నచ్చే వ్యక్తి తారక్‌తో, మాకు బాగా తెలిసిన దానయ్యగారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పాలని నాకు ఆసక్తిగా ఉంది. కొన్ని నెలలు క్రితం నేను ఎయిర్‌పోర్ట్‌కు వెళుతున్నప్పుడు.. ఆయన ఇళ్లు మధ్య దారిలోనే. వచ్చే దారిలో అలా క్యాజువల్‌గా వచ్చేసి వెళ్లు అన్నారు. వెళ్లాను. లోపలికి వెళ్లగానే తారక్ నేలమీద మంచి ఫోజులో అలా ఉండటాన్ని చూసి తనేంటి ఇక్కడున్నాడు అనుకున్నాను. అదేంటి బ్రో నువ్విక్కడ అని తారక్ అడిగాడు. నువ్వేం చేస్తున్నావ్ అని అడిగాను. తారక్ ఈలోపు మీరేమైనా మాట్లాడుకోవాలా రాజమౌళిగారు నేను.. బయటకు వెళతాను అన్నారు. కానీ నేను.. నా ఫ్లైట్‌కి ఇంకా టైముంది మీరేమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి నేను వెయిట్ చేస్తాను అన్నాను. కొంత సేపు కన్‌ఫ్యూజన్‌లో ఉంచి.. మమ్మల్ని లోపలికి తీసుకెళ్లి ఆయన ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. మా ఇద్దరికీ చాలా ఆనందమేసింది. కచ్చితంగా మాకు ఇద్దరికీ ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది ఇద్దరం ఒకేసారి చెప్పాం. ఆ సంఘటన నా జీవితంలో మరచిపోలేని సంఘటన. దాని తర్వాత తీసిన ఫోటోనే సోఫాలో కూర్చున్న ఫోటోని అందరూ చూశారు. చాలా బాధ్యతగా డిజైన్ చేసిన క్యారెక్టర్స్‌ని మేం కూడా అలాగే ఫీల్ అవుతూ చేస్తున్నాం. ఇదొక ఫిక్షనల్ స్టోరి. చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఇంతకు వచ్చిన సినిమా కంటే ఇది పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నేను తారక్‌తో వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మా ఇద్దరి షెడ్యూల్స్ ఇంకా గట్టిగా స్టార్ట్ కాలేదు. నేను నా బద్రర్ తారక్‌తో పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను'' అన్నారు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ - ''సాధారణంగా ప్రెస్ కాన్ఫెరెన్స్‌కి వచ్చేటప్పుడు కాన్ఫిడెంట్‌గా వస్తాను. కానీ ఎందుకో ఈసారి కాస్త నెర్వస్‌గా ఉంది. ఓవర్ వెల్మింగ్‌గా అనిపిస్తుంది. ఇది జక్కన్నతో నా నాలుగో చిత్రం. అన్నింటి కంటే ఇదొక స్పెషల్ మూవీగా నా కెరీర్‌లో మిగిలిపోతుంది. ఎందుంటే జక్కన్నతో పనిచేయడం దాంతో పాటు.. చరణ్‌తో నటించడం. మా ఇద్దరి బాండింగ్ ఈ చిత్రంతో మొదలవలేదు. నాకు తెలిసిన ఓ మంచి మిత్రుడు. నా కష్టసుఖాలు పంచుకునే స్నేహం ఉన్న మిత్రడు. ఈ సినిమాలో పనిచేయడాని కంటే ముందే ఈ బాండింగ్ ఎప్పుడైతే ఏర్పడిందో అది చిత్రంలోకి వచ్చేసరికి .. ఈ సినిమాలో కలిసి పనిచేసేసరికి మా బాండింగ్ వేరే లెవల్‌కి వెళ్లిపోయింది. ఈ స్నేహం ఇలాగే ఉండిపోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆర్ ఆర్ ఆర్ .. ఎ ఫిలిం డిమాండ్స్ ఎ లాట్ ఫ్రమ్ యాక్టర్స్. మనకు తెలియని ఓ గీత ఉంది. అల్లూరి సీతారామరాజుగారి గురించి కానివ్వండి.. కొమరం భీమ్‌గురించి కానివ్వండి.. ఇద్దరి గొప్ప వ్యక్తులు గురించి మనకు తెలియని గీత ఒకటి ఉంది. ఇప్పుడు ఇద్దరూ కనుక కలిసుంటే.. ఏం జరిగుండేది? అనే తాత్పర్యాన్ని దర్శకుడు కథలోకి తీసుకొచ్చాడో నటులుగా అది మాకు కొత్త అయ్యింది. కంప్లీట్ బ్లాంక్‌గా ఉన్నాను. ఎందుకంటే ఓ నటుడికి ఇన్‌ఫర్మేసన్ ఎంత తక్కువగా ఉంటే.. అంత పెర్ఫామెన్స్ బయటకు వస్తుందని నేను నమ్ముతాను. నాకు, చరణ్‌కి నటులుగా ఎదగడానికి ఈ చిత్రం ఎంతగానో దోహదపడుతుంది. ఈ చిత్రానికి షూటింగ్ ప్రారంభించడానికి ముందు మేం చేసిన వర్క్ షాప్స్ ఫెంటాస్టిక్. ఇప్పటి దాకా చేసిన 28 సినిమాల్లో నేను చేసిన దాని కంటే ఈ సినిమాలో నేను తీసుకున్న శిక్షణ.. మా ఫ్యూచర్ ఫిలింస్‌కు హెల్ప్ అవుతుంది.
ఇలాంటి గొప్ప పాత్రలను చేయడం చాలా గొప్ప విషయం. రాజమౌళిగారి బ్రెయిన్‌లో నుండి వచ్చిన ఈ థాంట్ 101 శాతం గొప్ప చిత్రంగా నిలుస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. నటులుగా ఈ సినిమాలో భాగం కావడం మా అదృష్టం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు జక్కన్నకి కృతజ్ఞతలు. ఆయన అడిగిన వెంటనే నాతో ఏకీభవించి ఎలాంటి బేషజాలు లేకుండా, స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకోవడానికి అంగీకరించినందుకు చరణ్‌కు థాంక్స్. మా జనరేషన్‌లో మేం దీన్ని సాధ్యమయ్యేలా చేశాం. ఇది సాధ్యమవడానికి కారణం జక్కన్నపై మాకున్న నమ్మకమే. మా ఫ్రెండ్‌షిప్‌పై మాకున్న నమ్మకం. మా నమ్మకం ఈ చిత్రానికి ఓ పాజిటివిటీగా మారి ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతికి లోనవుతారని నమ్ముతున్నాను'' అన్నారు.
నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - ''భారతదేశం గర్వించే దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళిగారితో ఈ సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతమో, నా భార్య పిల్లల అదృష్టం తెలియదు.రెండు పెద్ద ఫ్యామిలీస్‌తో వచ్చిన ఇద్దరు సమ ఉజ్జీలైన హీరోలతో సినిమా చేసే అవకాశం కల్పించిన రాజమౌళిగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పటికీ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ నెలాఖరున అహ్మదాబాద్, పూణేలో 30 రోజుల షెడ్యూల్ ఉంది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో సినిమాను నిర్మిస్తున్నాం. ఈ సినిమాను 2020 జూలై 30 ప్రపంచ వాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నాం. వేరే భాషల్లో కూడా సినిమాను విడుదల చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. 10 ఇండియన్ లాంగ్వేజెస్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాం'' అన్నారు.