మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి కనకదుర్గ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. విజయ్ హీరోగా తమిళంలో సూపర్ హిట్ అయిన 'తెరి' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తీ చేసుకుంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ మొదలైంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.