సెన్సార్ లో కృష్ణారావ్ సూపర్ మార్కెట్

13 Mar,2019

ప్రముఖ సీనియర్ నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ' కృష్ణారావ్ సూపర్ మార్కెట్ '..ఎల్సా ఘోష్ కథానాయిక గా  పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోగా, ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది.. లవ్ సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కి శ్రీనాథ్  పులకురమ్ దర్శకత్వం వహించారు.. బి.జి.ఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్ పై గౌతమ్ రాజు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.. ప్రముఖ సంగీత దర్శకుడు బోలె షావలి సంగీతం సమకూర్చగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఏ.విజయ్ కుమార్ డీఓపీ గా  బాధ్యతలను నిర్వర్తించారు.. వచ్చేనెలలో సినిమా ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Recent News