నాటకం చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రా దర్శకుడు కళ్యాణ్ జి గోగణ రెండో సినిమా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కాకినాడలో ఈరోజు మొదలుపెట్టారు. ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విశ్వాంత్ హీరోగా నటిస్తున్నాడు. ప్రేమ కథా చిత్రం కావడం... టైటిల్ నే ప్రేమ పేరుతో పెట్టడంతో యూత్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. 2004 లో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. నక్షత్ర మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్లో రాజశేఖర్ సమర్పణలో... జెకె క్రియేషన్స్ బ్యానర్లో కాశిం, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతమందిస్తుండడం విశేషం. బ్లాక్ బస్టర్ గరుడ వేగ సినిమాని తన కెమెరా పనితనంతో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లి... ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న గరుడవేగ అంజి ఈ చిత్రానికి డిఓపి గా పని చేస్తున్నారు. అంజి కెమెరా వర్క్ తో ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండనుంది.