చిత్రలహరి టీజర్ విడుదల

13 Mar,2019

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా `నేను శైల‌జ` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో  మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి  ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్బంగా    టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు ఈ కార్యక్రమంలో  ఈ సంద‌ర్భంగా.. నిర్మాత న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ - `` చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.   సినిమా చాలా బాగా వ‌చ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. టైటిల్ చెప్ప‌గానే బాగా న‌చ్చింది.  ఏప్రిల్ 12న సినిమాను విడుద‌ల చేస్తున్నాం.  ఏప్రిల్ మొద‌టి వారంలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను కండెక్ట్ చేసి.. ఏప్రిల్ 12న విడుద‌ల చేస్తాం. బ్ర‌హ్మాండ‌మైన స‌క్సెస్ సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాం. సాయిధ‌ర‌మ్‌గారికి మ‌ళ్లీ సుప్రీమ్ డేస్ వ‌స్తాయ‌నే గ‌ట్టిగా న‌మ్ముతున్నాం`` అన్నారు
ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ - ``మీడియాకు థాంక్స్‌. అడ‌గ్గానే టీజ‌ర్‌కు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన సుకుమార్‌గారికి కృత‌జ్ఞ‌త‌లు. అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు న‌వీన్‌, ర‌వి, మోహ‌న్‌గారికి థాంక్స్‌. అలాగే న‌న్ను స‌పోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సంతోషంగా ఉంది. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు. 
హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ - ``కిషోర్‌గారు స్క్రిప్ట్ చెప్పిన‌ప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఒప్పుకున్నాను. ఆయ‌న హీరోయిన్ క్యారెక్ట‌ర్స్‌ను బ్యూటీఫుల్‌గా నెరేట్ చేశారు. సాయిధ‌రమ్ వండ‌ర్‌ఫుల్ కోస్టార్‌. ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం హ్యాపీ. సినిమా ఏప్రిల్ 12న విడుద‌ల‌వుతుంది. సినిమా స‌క్సెస్ సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంగా ఉన్నాం`` అన్నారు. 
సునీల్ మాట్లాడుతూ - ``నేను భీమ‌వ‌రంలో చ‌దువుకుంటున్న రోజుల్లో మేమెప్పుడైనా వైన్ షాప్‌కెళ్లి కూర్చుంటే .. నేను ఎలా బిహేవ్ చేసేవాడినో.. అలాంటి క్యారెక్ట‌ర్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌. నేను మంచి క్యారెక్ట‌ర్ కోసం ఎదురు చూస్తున్న త‌రుణంలో ఈ సినిమా ద్వారా ఓ మంచి క్యారెక్ట‌ర్ రావ‌డం ఆనందంగా ఉంది.  అన్నారు. 
సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ మాట్లాడుతూ - ``అడ‌గ్గానే వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డానికి ఒప్పుకుని, వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన సుకుమార్‌గారికి థాంక్స్‌. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు అద్భుత‌మైన సంగీతంతో పాటు. అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. నాలుగు పాటలు చాలా ఉన్నాయి. మంచి సినిమా చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు న‌వ‌న్‌గారికి, ర‌విగారికి, మోహ‌న్‌గారికి థాంక్స్‌. చాలా స‌పోర్ట్ చేస్తూ,.. ఎక్క‌డా ఏ లోటు లేకుండా చూసుకున్నారు. ఇక డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల‌గారు క‌థ‌ను ఎంత బాగా చెప్పారో... అంత కంటే బాగా సినిమాను డైరెక్ట్ చేశారు.   కార్తీక్ అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. నువ్వు నేను సినిమా చేస్తున్న స‌మయంలో సునీల్ అన్న కామెడీ టైమింగ్‌.. కామిక్ సెన్స్‌ను బాగా ఎంజాయ్ చేసేవాడిని. న‌టుడిగా మారిన త‌ర్వాత ఆయ‌న‌తో ఓ సినిమా అయినా చేయాల‌ని అనుకున్నాను. ఈ సినిమాలో ఆయ‌న క‌లిసి ప‌నిచేశాను.. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డాన్ని ఎంజాయ్ చేశాను`` అన్నారు.  

Recent News