నా పేరు సూర్య తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఇంతకుముందు వీరి కాంభినేషన్ పలో జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ స్టేజ్ లో వున్నా ఈ కొత్త చిత్రం త్వరలోనే లాంఛ్ కానుంది. ఇక ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రకు క్యాథరిన్ ట్రెసా ను తీసుకొవాలనుకుంటున్నారట. ఒకవేళ అదే జరిగితే బన్నీ తో ఆమె కు ఇది నాల్గవ సినిమా అవుతుంది. ఇంతకుముందు క్యాథరిన్ ,బన్నీ తో కలిసి ఇద్దరమ్మాయిలతో , సరైనోడు , రుద్రమదేవి చిత్రాల్లో నటించింది. ఇక ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తన పాత స్టైయిల్లో తెరకెక్కించనున్నాడట. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.