కోల్కతా వెళుతున్న ట్రిపుల్ ఆర్ టీమ్

08 Mar,2019

ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజీ కాంబోలో రూపొందుతున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ షూటింగ్ అయితే జరుగుతోంది కానీ హీరోయిన్ల సంగతే ఎటూ తేలడం లేదు  రాజమౌళి మాత్రం పాత హీరోయిన్స్ కాకుండా  ఫ్రెష్ బ్యూటీస్ కోసమే ట్రై చేస్తున్నాడు.  అందులో మొదటి పేరు రాజీ సుందరి అలియా భట్ ఉందనే టాక్ కొద్దిరోజుల క్రితమే వచ్చింది . తన డేట్స్ కోసం జక్కన్న రకరకాలుగా ట్రై చేస్తున్నట్టు సమాచారం. తనను పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు  బాహుబలి హింది వెర్షన్ నిర్మాత కరణ్ జోహార్ ద్వారా మధ్యవర్తిత్వం చేయిస్తున్నా రెస్పాన్స్ వెంటనే రావడం లేదని టాక్. దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం అలియా భట్ బాలీవుడ్ లోనే భారీ ప్రాజెక్ట్స్ లో చిక్కుకుపోయింది. వాటికే ఈ ఏడాది మొత్తం సరిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ ఆర్ ఆర్ ఎంత వదులుకూడని సినిమానే అయినప్పటికీ తక్కువ డేట్స్ తో జరిగే పని కాదు కాబట్టి అయోమయంలో ఉన్నట్టు సమాచారం.  

Recent News