క‌థ‌నం టీజర్ విడుదల

08 Mar,2019

ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం క‌థ‌నం. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. రాజేష్‌నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ మెయిన్ లీడ్ గా న‌టిస్తున్నారు.  మహిళా దినొత్సవం సందర్బంగా ఈ చిత్ర టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చెయనున్నారు. ఈ సందర్బంగా నిర్మాత న‌రేంద్ర రెడ్డి మాట్లాడుతూ...  క‌థ న‌చ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చెస్తున్నాము. అన‌సూయ‌గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఆవిడ కేరీర్ లొ ఇదొక  బ్లాక్ బ‌స్ట‌ర్  అవుతుంద‌ని  న‌మ్మ‌కం ఉంది. మహిళా దినొత్సవం సందర్బంగా మార్చి8 న టీజర్ ను విడుదల చెస్తున్నామన్నారు.
దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ... ఇది నా మొద‌టి చిత్రం. క్ష‌ణం, రంగ‌స్థ‌లం అనంతరం క‌థ‌నం తో   హేట్రిక్ కొట్ట‌బోతుంది అన‌సూయ‌గారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. న‌రేంద్ర‌రెడ్డిగారు పంపిణిదారునిగా  ఏ సినిమా చేసిన హిట్ ఆయ‌న‌ది ల‌క్కీ హ్యాండ్. ఏ సినిమా చేసినా హిట్ అయ్యాయి. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారు.. 

Recent News