27నుండి  బన్నీ - త్రివిక్రమ్ సినిమా షూటింగ్ 

08 Mar,2019

నా పేరు సూర్య తరువాత ఏడాది గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న స్టార్ట్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ డేట్ ను చిత్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ఇక బన్నీ కి త్రివిక్రమ్ తో ఇది మూడో సినిమా. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి’ మంచి విజయాలు సాదించాయి. మరి ఈ చిత్రం వీరికి హ్యాట్రిక్ ను ఇస్తుందో చూడాలి.  ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ , సుకుమార్ తో సినిమా చేయనున్నారు. ఆర్య సిరీస్ తరువాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ మూడో సారి నటించనున్నాడు. ఆగస్టు నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

Recent News