మే 9న  మహర్షి 

06 Mar,2019

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మార్చి 6న ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో... నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు మాట్లాడుతూ - ''మహర్షి' చిత్రం చిత్రీకరణ తుది దశలో ఉంది. మార్చి 17 నాటికి రెండు సాంగ్స్‌, కొన్ని మాంటెజెస్‌ మినహా చిత్రీకరణ పూర్తవుతుంది. రెండు సాంగ్స్‌ సెట్‌ వేసి తీస్తాం. మాంటేజ్‌ సన్నివేశాలను అబుదాబిలో చిత్రీకరిస్తాం. ఏప్రిల్‌ 12కి సాంగ్స్‌తో సహా సినిమా మొత్తం పూర్తవుతుంది. వంశీ తన కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీ చేస్తున్నాడు. ఈ స్క్రిప్ట్‌ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. యూనిట్‌ అంతా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం. అశ్వినీదత్‌గారు, నేను, పివివిగారు సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఏప్రిల్‌ 25 నాటికి సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి కావడానికి సమయం పడుతుండటంతో నేను, మహేష్‌, వంశీ.. టీమ్‌ అంతా కలిసి మాట్లాడుకుని, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించిన ఈ సినిమాను మే 9న విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నాం. యాద చ్ఛికంగా అదేరోజున అశ్వినీదత్‌గారికి 'జగదేకవీరుడు-అతిలోకసుందరి, మహానటి' వంటి బ్లాక్‌బస్టర్స్‌ విడుదలయ్యాయి. 'ఆర్య, పరుగు, భద్ర' వంటి సూపర్‌హిట్స్‌ నాకున్నాయి. ఇలా సెంటిమెంట్‌గా కూడా కలిసొచ్చింది. ఓ ఎక్స్‌ట్రార్డినరీ సినిమాకు ఎక్స్‌ట్రార్డినరీగా అన్నీ విషయాలు కలిసొస్తున్నాయి. మహేష్‌గారి కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీగా 'మహర్షి' నిలుస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి మా బ్యానర్‌లో బ్లాక్‌బస్టర్‌ కొట్టాం. ఈ సమ్మర్‌కి కూడా 'మహర్షి'తో బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం. 'ఒక్కడు, పోకిరి, శ్రీమంతుడు' సినిమాల తరహాలో ఈ సినిమాలో నావల్‌ పాయింట్‌ ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు మన వంతుగా మనం ఏం చేస్తున్నాం అనే ఫీలింగ్‌తో బయటకు వస్తాడు'' అన్నారు. 
దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్‌ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌బాబు, కె.ఎల్‌.ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి. 

Recent News