సెగలు పుట్టిస్తున్న విద్యాబాలన్ 

12 Apr,2019

విద్యాబాలన్  డర్టీ పిక్చర్ లో నటించి తన విశ్వరూపం చూపించి రసిక హృదయాలకు నిద్దర లేకుండా చేసింది. ఆ సినిమా తరువాత విద్యాబాలన్ బాలీవుడ్ లో రేపిన హంగామా అంతా ఇంతా కాదు !! ఆ తరువాత హీరోయిన్ లీడ్ లో చాలా సినిమాలు చేసి సత్తా చాటింది. ఈ మద్యే నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు లో బసవతారకం గా నటించిన విద్యా నటించిన మొదటి తెలుగు సినిమా ఇదే. ఇన్నిరోజులు హౌస్ వైఫ్ పాత్రల్లో నటిస్తున్న విద్యా బాలన్ ఫోకస్ మళ్ళీ గ్లామర్ వైపు మళ్లినట్టుంది. దానికి హింట్ ఇచ్చినట్టుగా .. ఓ మ్యాగజిన్ కోసం అందాలు ఆరబోసింది. ఇప్పటికీ  ఎక్కడ తగ్గని గ్లామర్ తో మరోసారి రసిక రాయుళ్ళపై మన్మధ బాణాలు వేసి కట్టిపడేసింది విద్యా.  

మొత్తానికి విద్యా బాలన్ ఈ వయసులో ఇంకా ఏమాత్రం సడలని గ్లామర్ తో రెచ్చిపోవడం చేస్తుంటే .. ఆమె మరోసారి డర్టీ పిక్చర్ లాంటి సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య బాలీవుడ్ లో సెక్స్ కంటెంట్ తో పలు సినిమాలు తెరకెక్కుతూ నానా రచ్చ చేస్తున్నాయి .. మరి ఆ తరహాలో ఏదైనా అవకాశం వస్తే చేయడానికి రెడీ అన్నట్టుంది విద్యా పోజు.  

Recent Gossips