విజయ్ దేవరకొండకు జోడిగా నయనతార

04 Mar,2019

ఏంటి షాక్ అవుతున్నారా .. మీరు వింటున్నది నిజమే .. టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు క్రేజు జస్ట్ తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు.  సౌత్ మొత్తంగా యూత్ లో మంచి  ఫాలోయింగ్ ఉంది.  ఇక తమిళంలో అయితే కాస్త ఎక్కువగానే ఉండడం విశేషం.  అందుకేనేమో 'నోటా' ఫ్లాప్ అయినా తమిళ మేకర్స్ దగ్గరనుండి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.  తాజాగా రౌడీగారికి ఒక తమిళ-తెలుగు బైలింగువల్ ఆఫర్ వచ్చిందని సమాచారం. 'నోటా' కూడా ద్విభాషా చిత్రమే  కానీ. ఈ సినిమా  హీరోయిన్ స్పెషల్ అంట.  సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఈ సినిమాను పాపులర్ తమిళ నిర్మాత ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తుండగా  ఒక యువ దర్శకుడు పరిచయమవుతాడట. ఇందులో హీరోగా విజయ్  నటిస్తాడని ప్రచారం జరుగుతుంది.   ఈ వార్త మాత్రం కొలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ కు నయనతార స్టార్డమ్ కనుక తోడైతే ఈ సినిమా వేరే రేంజ్ లో ఉంటుందని వేరే చెప్పాల్సినపనిలేదు . అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాలి.  

Recent Gossips