మెగా ఛాన్స్ కొట్టేసిన కీర్తి  సురేష్

11 Apr,2019

చిరంజీవి హీరోగా నటిస్తున్న అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రం సైరా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చివరిదశకు చేరుకుంది.  సైరా నరసింహ రెడ్డి పేరుతో,  నాటితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మెగాస్టార్ హీరోగా నటించే 152వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు సిద్ధం చేసాడు. 

ఇక చిరంజీవి ఓకే అంటే వెంటనే షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ గా ఉన్న కొరటాల మెగాస్టార్ కు జోడిగా హీరోయిన్ ఎంపికలో బిజీ అయ్యాడు. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అందులో నయనతార, అనుష్క, తమన్నాల పేర్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే, తాజాగా ఈ సినిమాకోసం మరో కొత్త హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ పేరు ఎవరిదో కాదు గత ఏడాది మహానటిగా సౌత్ ప్రేక్షకుల మన్ననలు అందుకున్న కీర్తి సురేష్ ? ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం మహానటి తరువాత కీర్తి సురేష్ చేసిన రెండు తమిళ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకోవడం. తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోవడంతో కీర్తికి నిజంగా ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. ఈ మద్యే అటు బాలీవుడ్ లోకూడా పాగా వేయడానికి ప్లాన్ చేస్తున్న కీర్తి సురేష్ అక్కడ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి. మెగాస్టార్ - కొరటాల శివల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా రైతు కథతో తెరకెక్కనుందని టాక్.  త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రానుందట.    
 

Recent Gossips