ఆర్ ఆర్ ఆర్ కు షాకిచ్చిన హీరోయిన్

09 Apr,2019

బాహుబలి తరువాత క్రేజీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న  అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్.   ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ పూణే లో జరుగుతుండగా రామ్ చరణ్ కాలికి గాయం అవ్వడంతో మూడు వారాలపాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ట్రిపుల్ ఆర్ యూనిట్ కి ఓ హీరోయిన్ కూడా షాకిచ్చి ఈ సినిమాలో తాను నటించడం లేదని చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ భామ అలియా భట్ ను , హాలీవుడ్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ లను ఎంపిక చేసారు. తాజగా డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ సినిమాలో నటించలేకపోతున్నాను అంటూ, దానికి కారణాలు అనివార్యమని చెప్పింది. దాంతో షాక్ అయిన రాజమౌళి అండ్ టీమ్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఈ సినిమాలో డైసీ నటించడం లేదని ప్రకటించింది యూనిట్. 

ఇటీవలే గుజరాత్ లో కూడా షూటింగ్ విజయవంతంగా పూర్తీ చేశామని, అక్కడి ప్రజలు ఎంతగానో సహకరించారని రాజమౌళి తెలిపారు. ఏప్రిల్ చివరి వారంనుండి ఈ సినిమా ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని జూన్ 2020 లో విడుదల చేస్తారట. ఇప్పటికే ఈ సినిమా విషయంలో ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ నెలకొంది. టాలీవుడ్ స్టార్స్ చరణ్ - ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో సినిమా అనగానే అటు మెగా, ఇటు నందమూరి ఫాన్స్ తెగ ఆసక్తి ఎక్కువైంది. 
 

Recent Gossips