అప్పుడే అతన్ని ప్రేమించానంటున్న రాధికా

21 Mar,2019

బాలీవుడ్ లో పలు సంచలనాలు రేపి ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ఫైర్ బ్రాండ్ రాధికా ఆప్టే గురించి అందరికి తెలిసిందే .. కథ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు రెడీ అయ్యే ఈ భామ తన ప్రేమ కథ గురించి చెప్పింది ?  తాజాగా ఆమె ‘ఓ మై హృతిక్’ అనే కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకుంది. తాను చదువుకునే రోజుల్లో ఓ అబ్బాయిని ఇష్టపడ్డానని, అతను కలలోకి వస్తాడని త్వరగా నిద్ర పోయేదాన్నని వివరించింది. సినిమాలు చూస్తూ తనను తాను హీరోయిన్‌లా భావించేదానన్ని తెలిపింది. ‘నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా ఇంట్లో ఓ పని మనిషి ఉండేది. తను ఎక్కువగా సినిమాలు చూసేది. నేను కూడా తనతో పాటే సినిమాలు చూసేదాన్ని. కొన్ని పాటల్లో వర్షం పడుతున్నప్పుడు హీరోయిన్‌ చీరకొంగు గాలికి ఎగరడం, ఆ తర్వాత హీరో వచ్చి ఆమెతో పాటలు పాడుతూ చిందులేయడం ఎక్కువగా ఉండేవి. నేను కూడా నన్నో హీరోయిన్‌లా ఊహించుకునేదాన్ని. మా క్లాస్‌లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నేను కూడా చీరకట్టుకుని వర్షంలో తడుస్తున్నప్పుడు అతను నాతో డ్యూయెట్లు పాడితే బాగుండునని ఊహించుకునేదాన్ని. అది ఎప్పుడూ జరగలేదు అంటూ తన వన్ సైడ్ లవ్ స్టోరీ ని చెప్పింది. 

Recent Gossips