రాజకీయాల్లోకి మాధవి లత 

19 Mar,2019

నచ్చావులే ఫేమ్ మాధవి లతా గుర్తుందిగా .. ఈ మద్యే పలు సంచలనతో హంగామా రేపిన ఈ భామ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అదికూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎం ఎల్ ఏ గా పోటీకి సిద్ధం అవుతుంది.  కొన్నాళ్లుగా బీజేపీ తరఫున గళం వినిపిస్తున్న మాధవీలతకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. బీజేపీ అధినాయకత్వం ఆదివారం ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మాధవీలత పేరు కూడా ఉంది. మాధవీలత అసలు పేరు పసుపులేటి మాధవి. ఆమె కర్ణాటకలోని బళ్లారిలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. అక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేసిన అనంతరం టాలీవుడ్ లో ప్రవేశించి అనేక చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే  గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఈసారి గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలోకి వెళ్లగా, ఆయనకు మరో నియోజకవర్గం కేటాయించి ఇక్కడి నుంచి చంద్రగిరి ఏసురత్నానికి వైసీపీ టికెట్ ఇచ్చారు. టీడీపీ తరఫున మద్దాళి గిరి పోటీచేస్తున్నారు.

Recent Gossips